చిరు 151వ సినిమా టైటిల్, ట్యాగ్ లైన్ !


ప్రస్తుతం మెగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతున్న ప్రశ్న చిరు 151వ సినిమా టైటిల్ ఏంటి ? ఆరంభం నుండి అనుకుంటున్నట్లు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ అనేది టైటిల్ కాదనే వార్త నిన్న సాయంత్రం బయటికొచ్చింది. దీంతో అసలు టైటిల్ ఏమిటో తెలుసుకోవాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న బలమైన వార్తల ప్రకారం సినిమాకు ‘సై రా’ అనేది టైటిల్ అని దానికి ‘నరసింహారెడ్డి’ అంది ట్యాగ్ లైన్ అని తెలుస్తోంది.

బాగా ప్రచారంలో ఉన్న ఈ టైటిల్ ఎంతవరకు వాస్తవమో తెలియాలంటే ఇంకొద్ది సమయం వేచి చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది. ప్రస్తుతం గచ్చిబౌలిలో మోషన్ పోస్టర్ లాంచింగ్ ఈవెంట్ జరుగుతోంది. ఇప్పటికే మెగా హీరోలు రామ్ చరణ్, ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, శిరీష్ లతో పాటు అల్లు అరవింద్ కూడా వేడుకకు హాజరై ఉన్నారు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తుండటం విశేషం.