విజయ్ “ఖుషీ” నాన్ థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు?

విజయ్ “ఖుషీ” నాన్ థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు?

Published on Nov 9, 2022 9:00 AM IST

యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ స్టార్ హీరోయిన్ సమంత తో కలిసి నటిస్తున్న చిత్రం ఖుషి. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ను అనౌన్స్ చేసినప్పటి నుండి సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం కి సంబంధించిన నాన్ థియేట్రికల్ రైట్స్ పై తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ లో ఒక న్యూస్ వినిపిస్తోంది.

ఈ చిత్రం కి అన్ని బాషల్లో కలిపి నాన్ థియేట్రికల్ రైట్స్ 90 కోట్ల రూపాయలకి పైగా అమ్ముడైనట్లు తెలుస్తోంది. కాశ్మీర్ నేపథ్యం లో సాగే ఈ రొమాంటిక్ డ్రామా కి ఈ తరహాలో బిజినెస్ అంటే మామూలు విషయం కాదు. అంతేకాక విజయ్ దేవరకొండ చివరి చిత్రం లైగర్ రిజల్ట్ ఈ సినిమా పై ఎలాంటి ప్రభావం ను చూపలేదు అని స్పష్టంగా కనిపిస్తుంది. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం షూటింగ్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. లైగర్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఫ్యాన్స్ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు