బజ్ : ‘స్కంద’ నుండి మరొక ట్రైలర్ రిలీజ్?

Published on Sep 19, 2023 5:06 pm IST


యువ నటుడు రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ స్కంద. ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్ని కూడా అందరినీ ఆకట్టుకుని మూవీ పై భారీ హైప్ ఏర్పరిచాయి. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో సాయి మంజ్రేకర్ ఒక కీలక పాత్ర చేస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాత శ్రీనివాస చిట్టూరి స్కంద ని భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. కాగా విషయం ఏమిటంటే, సెప్టెంబర్ 23న స్కంద నుండి మరొక ట్రైలర్ ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కాగా దీని పై వారి నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ అతి త్వరలో రానుంది. ఇక ఈ పాన్ ఇండియన్ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి సెప్టెంబర్ 28న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

సంబంధిత సమాచారం :