బజ్: బాలయ్య కొత్త సినిమా షూటింగ్ డేట్ ఇదే !

బజ్: బాలయ్య కొత్త సినిమా షూటింగ్ డేట్ ఇదే !

Published on Dec 5, 2022 5:46 PM IST

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ‘వీరసింహా రెడ్డి’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు, జనవరి 12, 2023 న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల చేయడానికి షెడ్యూల్ చేయబడింది. అయితే, మరోవైపు, బాలయ్య తన తదుపరి చిత్రం పై ఫోకస్ పెట్టారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా నటించనున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 8న హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ షూట్ కోసం ఓ మండువా హౌస్ సెట్ వేశారని, ఈ సెట్ లో తీసే యాక్షన్ ఎపిసోడ్ తోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది.

ఈ చిత్రంలో బాలయ్య కూతురిగా శ్రీలీల కనిపించనుంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి క్యాస్టింగ్ ను కూడా ఫైనల్ చేసుకుంటున్నాడు. ముఖ్యంగా బాలయ్యకి విలన్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ను తీసుకున్నారు. అలాగే ఈ సినిమాలో ప్రియాంక జవాల్కర్ కథానాయికగా నటించే అవకాశం ఉంది. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఇక అనిల్ – బాలయ్య కలయికలో సినిమా అనగానే ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు