‘భగవంత్ కేసరి’ ట్రైలర్ రిలీజ్ అప్పుడేనా ?

Published on Oct 2, 2023 12:10 am IST

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం బాలయ్య బాబుతో భగవంత్ కేసరి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 19న ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రం యొక్క ట్రైలర్‌ ను అక్టోబర్ 8న లాంచ్ చేయనున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్‌ లో తాజాగా బజ్ వినిపిస్తోంది. అయితే మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ చిత్రంలో శ్రీ లీల కీలక పాత్రలో కనిపించనుంది. భగవంత్ కేసరి చిత్రంలో అర్జున్ రాంపాల్ విలన్‌ గా టాలీవుడ్‌ లోకి అడుగుపెడుతున్నాడు.

అన్నట్టు సినిమాలో బాలయ్య పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉన్నా.. బాలయ్య పాత్ర తాలూకు ఆలోచనలు, యాక్టివిటీస్ చాలా సరదాగా సాగుతాయట. అలాగే ఈ సినిమాలో ఫాదర్ – కూతురు మధ్య ఓ ఎమోషనల్ ట్రాక్ కూడా ఫుల్ ఎంటర్ టైన్ గా ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి అనిల్ రావిపూడి – బాలయ్య కలయికలో సినిమా అనగానే ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాలో శ్రీలీల బాలయ్య బాబుకి కూతురిగా నటిస్తోంది.

సంబంధిత సమాచారం :