‘హలో గురు’ బజ్ క్రియేట్ అవుతుంది !

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రం ‘హలో గురు ప్రేమకోసమే’. ఇటీవల విడుదలైన ఈచిత్ర టీజర్ మంచి బజ్ ను తీసుకొస్తుంది. ఇప్పటివరకు 60లక్షల డిజిటల్ వ్యూస్ ను సొంతం చేసుకున్న ఈ టీజర్ యువత ను బాగా ఆకట్టుకుంది. ఇక నిన్న ఈచిత్రంలోని మొదటి సాంగ్ మై వరల్డ్ ఈజ్ ఫ్లైయింగ్ అనే సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది.

ఇక ఇదే స్ట్రాటజీ తో చిత్రానికి సంభందించిన సాంగ్స్, ట్రైలర్ ను ఒక్కొక్కటిగా విడుదలచేసి సినిమాపై మంచి హైప్ తీసుకురావాలని భావిస్తుంది చిత్రబృందం. నేను లోకల్ డైరెక్టర్ త్రినాధరావు నక్కిన తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుంది.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈచిత్రం దసరా కానుకగా అక్టోబర్ 18న విడుదలకానుంది.

Exit mobile version