మరో అద్భుత సృష్టితో మన ముందుకొస్తున్న కోడి రామకృష్ణ

మరో అద్భుత సృష్టితో మన ముందుకొస్తున్న కోడి రామకృష్ణ

Published on Sep 20, 2016 5:05 PM IST

nagabraham-1
1980వ దశకంలోని గొప్ప దర్శకుల్లో ఒకరైన కోడి రామకృష్ణ మరో అద్భుతమైన చిత్రంతో మన ముందుకురానున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ ను వాడుకుని సినిమా తీయడంలో ఈయన దిట్ట. ‘అమ్మోరు, అంజి, అరుంధతి’ వంటి చిత్రాలే అందుకు నిదర్శనాలు. ప్రస్తుతం ఈయన ‘నాగాభరణం’ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. విష్ణువర్ధన్(లేట్), రమ్య లు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదలకానుంది.

భారత సినీ చరిత్రలో మొదటిసారి చనిపోయిన వ్యక్తిని సీజీలో సృష్టించి ఈ సినిమా చేస్తున్నారు. ఇందు కోసం ‘బాహుబలి’ కోసం పనిచేసిన ప్రతిష్టాత్మక మకుట విఎఫ్ఎక్స్ సంస్థ పనిచేస్తోంది. ఈ చిత్రం కోసం సుమారు 550 మంది టెక్నీషయన్స్ పలు దేశాల్లో పని చేస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని సాజిద్ ఖురేషి, ధవళ్ గడ, సోహైల్ అన్సారీ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రెండురోజుల క్రితమే విడుదలైన ఈ చిత్రం తాలూకు ట్రైలర్ పూర్తి స్థాయి గ్రాఫిక్స్ తో కనుల విందుగా ఉంది. ఈ చిత్రంతో కోడి రామకృష్ణ మొదటిసారి కన్నడ పరిశ్రలోకి పెడుతున్నారు.

ట్రైలర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు