బజ్ : NC 23 మ్యూజిక్ డైరెక్టర్ గా ఆయన ఫిక్స్ ?

Published on Sep 26, 2023 2:00 am IST

యువ నటుడు అక్కినేని నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో త్వరలో ఒక మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు గ్రాండ్ గా నిర్మించనున్న ఈ మూవీ యొక్క అఫీషియల్ అనౌన్స్ ఇటీవల వచ్చింది. సాయి పల్లవి హీరోయిన్ గా నటించనున్న ఈ మూవీ మత్స్య కారుల కథగా రూపొందనుండగా ఇందులో నాగచైతన్య మత్స్యకారుడి పాత్రలో నటించనున్నారు.

కొన్ని వాస్తవిక ఘటనల ఆధారంగా రూపొందనున్న ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ రవిచందర్ ని తీసుకోవాలని భావించిన యూనిట్ కొన్ని కారణాల వలన అతడి స్థానంలో సంతోష్ నారాయణన్ ని తీసుకోవాలని యూనిట్ ఫిక్స్ అయిందట. అయితే దీని పై మేకర్స్ నుండి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. మరోవైపు సంతోష్ నారాయణన్ ప్రస్తుతం ప్రభాస్ కల్కి 2898 ఏడి, వెంకటేష్ సైంధవ్ మూవీస్ కి మ్యూజిక్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :