నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం సౌత్‌తో పాటు నార్త్‌లోనూ ది మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది. భాషతో సంబంధం లేకుండా ఆమె చేస్తున్న ప్రతి సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలుస్తోంది. ఆమె నుంచి ‘యానిమల్’, ‘పుష్ప-2’, ‘ఛావా’ ఇలా వరుసగా బ్లాక్‌బస్టర్ చిత్రాలు రావడంతో ప్రేక్షకుల్లో రష్మిక క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
ఇక ఇప్పుడు ఈ క్రేజ్‌ను నిర్మాతలు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే రష్మికతో బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ సినిమాలు చేసేందుకు క్యూ కడుతున్నారు. అయితే, బి-టౌన్ వర్గాల ప్రకారం బాలీవుడ్‌లోని ఓ స్టార్ ప్రొడ్యూసర్ రష్మికతో ఓ బిగ్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడట. లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌గా ఈ సినిమాను ఆయన భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేయాలని చూస్తున్నాడట. ఇక ఈ సినిమాను ఏకంగా రూ.100 కోట్ల బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేయాలని సదరు నిర్మాత ప్లాన్ చేస్తున్నాడట.
అయితే, రష్మిక క్రేజ్ ప్రస్తుతం పీక్స్‌లో ఉన్నప్పటికీ, లేడీ ఓరియెంటెడ్ సినిమాపై ఇంతటి బడ్జెట్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని పలువురు కామెంట్ చేస్తున్నారు. మరి నిజంగానే రష్మికంతో సదరు బాలీవుడ్ నిర్మాత వంద కోట్ల భారీ స్కెచ్ వేస్తాడా లేదా అనేది చూడాలి.