మెగాస్టార్ చిరంజీవి మరియు దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను నిర్మిస్తున్న కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ ప్రస్తుతం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో, మెగాస్టార్ తన ప్రాణ స్నేహితుడిని సెకండ్ ప్రొడ్యూసర్‌గా రంగంలోకి దించుతున్నట్లు సమాచారం. దీంతో సినిమా నిర్మాణాన్ని మరింత వేగవంతం చేయడమే కాకుండా, నిర్మాణ సంస్థకు ఒక భరోసాగా నిలవనుందని ఆయన భావిస్తున్నాడట.
నిజానికి KVN ప్రొడక్షన్స్ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. విజయ్ హీరోగా వస్తున్న ‘జననాయకన్’ మూవీ ఆన్‌లైన్‌లో లీక్ అవ్వడం ఆ సంస్థకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. మరోవైపు యష్ నటించిన ‘టాక్సిక్’ సినిమా కూడా విడుదల వాయిదా పడింది. ఇలాంటి సమయంలో టాలీవుడ్ డెబ్యూ ప్రాజెక్ట్ అయిన చిరంజీవి సినిమా విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతోనే ఈ ప్రొడక్షన్ పార్ట్నర్‌ను చేర్చుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ సినిమాలో చిరంజీవి ఒక ఏజ్డ్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు. థమన్ సంగీతం అందించే ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. మే నెలలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అధికారిక వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
