పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి హిస్టారికల్ యాక్షన్ చిత్రంగా ఈ మూవీ రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ అభిమానుల్లో అంచనాలను రెట్టింపు చేశాయి.
ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను మరింత గ్రాండ్‌గా నిర్వహించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ చిత్ర యూనిట్ ఓ ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అంతేగాక, ఈ సినిమా ట్రైలర్‌ను కూడా రెడీ చేస్తున్నారట. అయితే, ఈ చిత్ర ట్రైలర్‌ను ఏకంగా దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాపై రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.
ఇలా ఓ తెలుగు సినిమా ట్రైలర్ బుర్జ్ ఖలీఫాపై రిలీజ్ కావడంతో వీరమల్లు సెన్సేషన్ మామూలుగా ఉండదని చిత్ర యూనిట్ భావిస్తున్నారట. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్, బాబీ డియోల్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని జూన్ 12న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.