క్రేజీ కాంబో.. బాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ తో మెగా పవర్ స్టార్.. ఫిక్స్ అయితే సెన్సేషనే..!

Ram-Charan-Sanjay-leela-bha

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు లెజెండరీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ సెట్ కాబోతుందనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గతంలో వీరిద్దరూ కలిసి ‘ది లెజెండ్ ఆఫ్ సుహెల్ దేవ్’ కథను తెరకెక్కించాలని భావించినా కొన్ని కారణాల వల్ల అది పట్టాలెక్కలేదు. అయితే తాజాగా విజయేంద్ర ప్రసాద్ అందించిన ఒక హిస్టారికల్ జంగిల్ అడ్వెంచర్ పాయింట్‌పై వీరిద్దరూ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

​ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ‘పెద్ది’ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే సుకుమార్ దర్శకత్వంలో ఒక భారీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నాడు. మరోవైపు భన్సాలీ కూడా రణబీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్ లతో ‘లవ్ అండ్ వార్’ సినిమా పనుల్లో నిమగ్నమై ఉన్నారు. గతంలో అల్లు అర్జున్ కూడా భన్సాలీని పలుమార్లు కలిసినా, ఆ కాంబినేషన్ కు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

​భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేస్తున్న ఈ హిస్టారికల్ మూవీ గురించి అధికారిక ప్రకటన వస్తేనే ఈ పుకార్లకు చెక్ పడే అవకాశం ఉంది. టాలీవుడ్ హీరోల క్రేజ్ మరియు భన్సాలీ మేకింగ్ స్టైల్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఏదేమైనా, బాలీవుడ్ మరియు టాలీవుడ్ క్రేజీ కాంబోల కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఈ అప్‌డేట్ సరికొత్త జోష్ ఇస్తోంది.

Exit mobile version