ఊహించని కాంబో సెట్ చేస్తున్న చరణ్.. ఆ డైరెక్టర్‌తో హిస్టారికల్ డ్రామా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల ‘పెద్ది’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను సుకుమార్ డైరెక్షన్‌లో రూపొందించేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే, మెగా పవర్ స్టార్ త్వరలోనే ఎవరూ ఊహించని కాంబినేషన్‌తో రాబోతున్నట్లు సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది.

‘ఆదిపురుష్’ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రామ్ చరణ్ త్వరలో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓం రౌత్ రామ్ చరణ్‌కు ఒక కథను వినిపించాడని, దానికి చరణ్ కూడా సానుకూలంగా స్పందించాడని సమాచారం. ‘తానాజీ’, ‘ఆదిపురుష్’ వంటి చిత్రాలతో తనదైన ముద్ర వేసిన ఓం రౌత్, ఈసారి రామ్ చరణ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్ ఒక పీరియాడిక్ హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్నట్లు సమాచారం. ఓం రౌత్ గత చిత్రాల తరహాలోనే ఇది కూడా అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, భారీ గ్రాఫిక్స్‌తో కూడుకున్న విజువల్ వండర్‌గా ఉండబోతోందట. మరి నిజంగానే ఈ అన్‌ఎక్స్‌పెక్టెడ్ కాంబో పట్టాలెక్కుతుందా అనేది వేచి చూడాలి.

Exit mobile version