నేషనల్ క్రష్ రష్మిక మందన్న గ్లామర్ పాత్రలతో పాటు పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలతో కూడా ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. రీసెంట్‌గా ఇదే కోవలో ‘ది గర్ల్‌ఫ్రెండ్’లో ఆమె పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే, ఆమె తన నెక్స్ట్ చిత్రంగా కామెడీ జోనర్ చిత్రాలను రూపొందించే డైరెక్టర్‌తో చేయబోతుందనే వార్త సినీ సర్కిల్స్‌లో జోరుగా చక్కర్లు కొడుతోంది.
‘జాతిరత్నాలు’ సినిమాతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ కెవి అనుదీప్. ఆయన ప్రస్తుతం విశ్వక్ సేన్‌తో ‘ఫంకీ’ అనే సినిమాను రూపొందిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత రష్మిక ప్రధాన పాత్రలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
రష్మికతో ఎమోషన్ ప్రధానంగా ఉన్న ఓ సీరియస్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని రూపొందించేందుకు అనుదీప్ ప్లాన్ చేస్తున్నాడట. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా ఆయన చేస్తున్నట్లు సినీ సర్కిల్స్ టాక్. మరి కామెడీ నుంచి సీరియస్ జోనర్‌కు అనుదీప్ నిజంగానే మారుతాడా అనేది వేచి చూడాలి.
