నితిన్ సరసన యంగ్ బ్యూటీ లాక్.. కెమిస్ట్రీ పైనే అందరి చూపులు..!

వరుస పరాజయాలతో సతమతమవుతున్న యంగ్ హీరో నితిన్, ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. కెరీర్ పరంగా కీలకమైన దశలో ఉన్న ఆయన, కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇటీవల కొన్ని ప్రాజెక్టులు చర్చల దశలోనే ఆగిపోగా, మరికొన్ని చేజారిపోయాయి. ఈ క్రమంలోనే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ఒక కొత్త దర్శకుడికి నితిన్ అవకాశం ఇచ్చాడు. ఈ నెలాఖరున ఈ చిత్రం అధికారికంగా ప్రారంభం కానుంది.

ఈ సినిమాలో నితిన్ సరసన హీరోయిన్‌గా రితికా నాయక్ నటించబోతున్నట్లు సమాచారం. ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ చిత్రంతో తన నటనతో మెప్పించిన రితికా, ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఇప్పుడు నితిన్ సినిమాలో అవకాశం దక్కించుకోవడం ఆమె కెరీర్‌కు మరో ప్లస్ కానుంది.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే, ఇది ఒక పక్కా ఫ్యామిలీ డ్రామా సబ్జెక్ట్‌గా రానుందని తెలుస్తోంది. నితిన్ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయేలా, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఈ కథను సిద్ధం చేశారట. ఇప్పటికే చిత్ర యూనిట్ ఒక ఆసక్తికరమైన టైటిల్‌ను కూడా ఖరారు చేసినట్లు సమాచారం. మరి నితిన్-రితికా కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.

Exit mobile version