కోలీవుడ్‌లో ఇద్దరు దిగ్గజ దర్శకులు శంకర్, ఏ.ఆర్.మురుగదాస్ కలిసి ఒక ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్నారనే వార్త ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. శంకర్ రైటింగ్ టీమ్ అందించిన ఒక కథకు మురుగదాస్ స్క్రిప్ట్ మార్పులు చేర్పులు చేస్తున్నారని, వీరిద్దరి కాంబినేషన్ అతి త్వరలోనే పట్టాలెక్కనుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
బ్రహ్మాండమైన విజువల్స్ తీయడంలో శంకర్, పవర్‌ఫుల్ కమర్షియల్ ఎలిమెంట్స్ అందించడంలో మురుగదాస్ ఎక్స్‌పర్ట్స్ కావడంతో ఈ వార్త వినగానే అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే ఈ ప్రాజెక్ట్‌లో శంకర్ దర్శకుడిగా ఉండి మురుగదాస్ కథ అందించబోతున్నారా, లేదా మురుగదాస్ దర్శకత్వంలో శంకర్ కథ మాత్రమే ఇస్తున్నారా అనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు.
ఇప్పటివరకు నిర్మాతల నుంచి గానీ, ఈ దర్శకుల నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం ఇది కేవలం ఫిలిం నగర్ సర్కిల్స్ లో నడుస్తున్న రూమర్ మాత్రమే అయినప్పటికీ, ఒకవేళ ఇది నిజమైతే మాత్రం ఇండియన్ సినిమాలో అత్యంత క్రేజీ కాంబినేషన్‌గా నిలవడం ఖాయం.
