మరో క్రేజీ కాంబో.. చైతూ కోసం కథ రెడీ చేస్తున్న తరుణ్ భాస్కర్..?

naga chaithanya and tharun

కేవలం రెండు సినిమాలతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు తరుణ్ భాస్కర్. ప్రస్తుతం ఈ యంగ్ డైరెక్టర్ అటు మెగాఫోన్ పట్టి సినిమాలను తెరకెక్కిస్తూనే, ఇటు నటుడిగా వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నాడు. ఇప్పటికే ‘ఈ నగరానికి ఏమైంది 2’ షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేస్తున్న ఆయన, త్వరలోనే ‘పెళ్లి చూపులు 2’ను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు. ఇందులో విజయ్ దేవరకొండ కనిపిస్తాడా లేక కొత్త హీరో వస్తాడా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

​దర్శకుడిగా తరుణ్ భాస్కర్ తన నెక్స్ట్ ప్రాజెక్టును నాగచైతన్యతో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. చైతూ కోసం ఒక ఇంట్రెస్టింగ్ కథను సిద్ధం చేయగా, అది ఆయనకు బాగా నచ్చిందని టాక్. ప్రస్తుతం చైతన్య ‘వృషకర్మ’ సినిమా పనుల్లో ఉండగా, అది పూర్తయిన వెంటనే తరుణ్ భాస్కర్ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. ఒకవేళ అంతా కుదిరితే, ‘ఈ నగరానికి ఏమైంది 2’ తర్వాత తరుణ్ డైరెక్ట్ చేసే క్రేజీ ప్రాజెక్ట్ ఇదే అవుతుంది.

​మరోవైపు, సీనియర్ హీరో వెంకటేష్ కోసం తరుణ్ సిద్ధం చేసిన కథ ఇంకా స్క్రిప్ట్ స్టేజ్‌లోనే ఉంది. సురేష్ బాబు సూచించిన మార్పుల వల్ల ఆ ప్రాజెక్ట్ కాస్త ఆలస్యమవుతోంది. ఈ గ్యాప్‌లో చైతన్య తన ఇతర కమిట్‌మెంట్స్‌తో బిజీగా ఉన్నాడు. నాగార్జున – కళ్యాణ్ కృష్ణ కాంబోలో రాబోయే సినిమాలో కూడా చైతూ భాగమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, తరుణ్ మరియు నాగచైతన్య కాంబినేషన్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందోనని అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version