పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన రీసెంట్ మూవీ ఓజి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు సుజిత్ డైరెక్ట్ చేయగా పూర్తి యాక్షన్ డ్రామాగా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్‌ను యాక్షన్ మోడ్‌లో చూసిన అభిమానులు తెగ ఎంజాయ్ చేశారు. ఇక ఈ సినిమాను డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేశారు.
అయితే, ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉంటుందని గతంలో తెలిపిన మేకర్స్, కొన్ని కారణాల వల్ల ఆ సీక్వెల్ మూవీని తెరకెక్కించడం లేదని క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే, ఇప్పుడు ఈ సీక్వెల్ మూవీపై తాజాగా సినీ సర్కిల్స్‌లో ఓ ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. సుజిత్ ఈ సీక్వెల్ మూవీని ఎలాగైనా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడట. దీంతో ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ వార్తతో అభిమానుల్లో ఒక్కసారిగా ఓజి సీక్వెల్‌పై ఆసక్తి పెరిగింది. నిజంగానే ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ ప్రొడ్యూస్ చేస్తారా.. ఈ సినిమాను ఎప్పుడు పట్టాలెక్కి్స్తారు.. అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
