‘విశ్వంభర’ ట్రైలర్ రెడీ.. మరి ఎప్పుడు వదులుతారో..?

 Vishwabhara

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో, ఇప్పుడు అందరి దృష్టి ఆయన నెక్స్ట్ మూవీ ‘విశ్వంభర’ ( Vishwabhara )పై పడింది. భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైనప్పటికీ, వీఎఫ్ఎక్స్ పనుల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. గతంలో విడుదలైన టీజర్‌పై వచ్చిన నెగటివ్ ఫీడ్‌బ్యాక్‌ను సీరియస్‌గా తీసుకున్న చిత్ర బృందం, ప్రేక్షకులకు అత్యుత్తమ అనుభూతిని అందించేలా సీజీ వర్క్‌ను మళ్లీ మెరుగుపరుస్తోంది.

తాజాగా ‘కపుల్ ఫ్రెండ్లీ’ ప్రమోషన్లలో నిర్మాత ధీరజ్ మొగిలినేని ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘విశ్వంభర’ థియేట్రికల్ ట్రైలర్ ఇప్పటికే సిద్ధమైందని, అది తనను విపరీతంగా ఆకట్టుకుందని ఆయన వెల్లడించారు. ఇప్పటివరకు టీజర్‌లో చూసిన విజువల్స్‌కు, రెడీగా ఉన్న ట్రైలర్‌కు ఎంతో తేడా ఉందని.. ఇది ప్రేక్షకులకు సరికొత్త హై ఇస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టీజర్ నిరాశపరిచిన నేపథ్యంలో, ఈ ట్రైలర్‌తోనైనా పాజిటివ్ బజ్ క్రియేట్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్ర ట్రైలర్ గనుక ప్రేక్షకులకు నచ్చితే సినిమా బిజినెస్ డీల్స్ కూడా త్వరగా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. మరి మెగా ఫ్యాన్స్ విశ్వంభర ట్రైలర్ కోసం ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలో చూడాలి.

Exit mobile version