‘బాహుబలి – 2’ ఫస్ట్ లుక్ రిలీజయ్యేది అప్పుడేనట !

17th, August 2016 - 11:39:23 AM

baahubali
దర్శక ధీరుడు ‘రాజమౌళి’ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం ‘బాహుబలి – ది కన్క్లూజన్’ చిత్రం ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో క్లైమాక్స్ యుద్ద్ సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ నిపుణుల సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ యుద్ద సన్నివేశాలు మొదటి భాగం కన్నా కూడా చాలా గొప్పగా ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ చివరి దశకు చేరిందని, ఈ నెలాఖరు కల్లా క్లైమాక్స్ షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది.

అలాగే మిగిలిన టాకీ పార్ట్, పాటల చిత్రీకరణ సెప్టెంబర్ నుండి నవంబర్ వరకూ జరుగుతుందని కూడా తెలుస్తోంది. ఇకపోతే అన్నిటికన్నా ఆసకికరమైన విషయం ఏమిటంటే ఈ చిత్రం తాలూకు ఫస్ట్ లుక్ ను హీరో, బాహుబలి పాత్రధారుడైన ‘యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్’ పుట్టినరోజైన అక్టోబర్ 23న విడుదల చేస్తారని వినికిడి. కానీ ఈ విషయంపై రాజమౌళి టీమ్ నుండి మాత్రం ఇంకా ఎటువంటి కన్ఫర్మేషన్ అందలేదు. ‘ఆర్కా మీడియా’ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్నిఏప్రిల్ 2017 లో విడుదల చేయనున్నారు.