బ‌జ్.. దీపావ‌ళికి వ‌స్తానంటోన్న ‘కుబేర‌’..?

బ‌జ్.. దీపావ‌ళికి వ‌స్తానంటోన్న ‘కుబేర‌’..?

Published on Jun 13, 2024 1:00 AM IST

టాలీవుడ్ లో ఫీల్ గుడ్ చిత్రాల ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్న డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల ప్ర‌స్తుతం ‘కుబేర’ అనే సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాలో కింగ్ నాగార్జున‌, త‌మిళ హీరో ధ‌నుష్ లు క‌లిసి న‌టిస్తుండ‌టంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచ‌నాలు క్రియేట్ అయ్యాయి. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్ అవ‌గా, దానికి ట్రెమెండ‌స్ రెస్పాన్స్ ల‌భించింది.

అయితే, ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త సినీ స‌ర్కిల్స్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ‘కుబేర’ చిత్రాన్ని దీపావ‌ళి కానుక‌గా రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ రెడీ అవుతున్నార‌ట‌. ప్రేక్ష‌కులు మెచ్చే విధంగా ఈ సినిమా కంటెంట్ ఉండ‌నుంద‌ని.. అందుకే ఈ చిత్రాన్ని పండుగ సీజ‌న్ లో రిలీజ్ చేస్తే బాగుంటుంద‌ని వారు ఆలోచిస్తున్నార‌ట‌.

ఇక ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమాలో ఓ యాక్ష‌న్ సీక్వెన్స్ ను చిత్రీక‌రిస్తున్నారు. ఈ సినిమాలో నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహ‌న్ రావు ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు