‘కృష్ణ’ సినిమా రీమేక్ లో ‘మహేష్ బాబు’ కుమారుడు ‘గౌతమ్’ ?

gautham-krishna
సాధారణంగా సినిమా సెలబ్రిటీల పిల్లల పై అభిమానుల ఆసక్తి కాస్త ఎక్కువగానే ఉంటుంది. తమ అభిమా హీరో కొడుకు కూడా ఖచ్చితంగా హీరోనే అవుతాడని, అవ్వాల్సిందేనని అభిమానులు మొదటి నుండే ఫిక్స్ చేసేసుకుంటారు. అలా టాలీవుడ్ ప్రిన్స్ ‘మహేష్ బాబు’ తనయుడు ‘గౌతమ్ కృష్ణ’ పై కూడా మహేష్ అభిమానులు అలాంటి ఆశలే పెట్టుకున్నారు. గౌతమ్ కూడా భవిష్యత్తులో హీరోనే అవుతాడని నిర్ణయించేసుకున్నారు.

తాజాగా టాలీవుడ్ సర్కిల్స్ లో వినిబడుతున్న వార్తల ప్రకారం సూపర్ స్టార్ ‘కృష్ణ’ సూపర్ హిట్ చిత్రమైన ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రాన్ని ‘గౌతమ్ కృష్ణ’ హీరోగా రీమేక్ చేస్తున్నారని, ఇప్పటికే కథ దాదాపుగా సిద్ధమైందని, ఈ చిత్రానికి దర్శకుడిగా ‘కృష్ణ వంశీ’ ని అనుకుంటున్నారని తెలుస్తోంది. ఈ చిత్రం మొత్తం సీతారామరాజు చిన్నతనంలో పడ్డ కష్టాల నైపథ్యంలో సాగుతుందని కూడా అనుకుంటున్నారు. కానీ ఈ వార్తపై మహేష్ బాబు నుండి ఎటువంటి సమాచారమూ అందలేదు. కనుక ఇందులో ఎంతమేర వాస్తవముందో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే. గతంలో గౌతమ్ మహేష్ చిత్రమైన ‘వన్ నేనొక్కడినే’లో నటించిన సంగతి తెలిసిందే.