బ‌జ్.. ‘మిస్ట‌ర్ బ‌చ్చ‌న్’ వ‌చ్చేది అప్పుడేనా..?

బ‌జ్.. ‘మిస్ట‌ర్ బ‌చ్చ‌న్’ వ‌చ్చేది అప్పుడేనా..?

Published on Jul 5, 2024 2:47 PM IST

మాస్ రాజా ర‌వితేజ న‌టిస్తున్న లేటెస్ట్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ మూవీ ‘మిస్ట‌ర్ బ‌చ్చ‌న్’ ఇప్పటికే షూటింగ్ ప‌నులు ముగించుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉంది. ఈ సినిమా పోస్ట‌ర్స్, వీడియో గ్లింప్స్ ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల్లో మంచి అంచ‌నాలు క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి సినీ స‌ర్కిల్స్ లో ఓ వార్త తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది.

‘మిస్ట‌ర్ బ‌చ్చ‌న్’ సినిమాను మేక‌ర్స్ ఆగ‌స్టు 15న రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాతో ర‌వితేజ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మ‌రోసారి సెన్సేష‌న‌ల్ హిట్ కొట్ట‌డం ఖాయ‌మ‌ని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియ‌ర్ షోను ఆగ‌స్టు 14న వేయ‌నున్న‌ట్లు కూడా వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే, దీనికి సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.

ఇక ఈ సినిమాను ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ డైరెక్ట్ చేస్తుండ‌టంతో ఈ సినిమాపై ప్రేక్ష‌కుల‌తో పాటు సినీ వ‌ర్గాల్లోనూ సాలిడ్ అంచ‌నాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాలో భాగ్య‌శ్రీ బొర్సె హీరోయిన్ గా న‌టిస్తోండ‌గా మిక్కీ జే మేయ‌ర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ పై టిజి.విశ్వ‌ప్ర‌సాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు