‘ది ప్యారడైజ్’ గ్లింప్స్ రెడీ చేసిన నాని..!

‘ది ప్యారడైజ్’ గ్లింప్స్ రెడీ చేసిన నాని..!

Published on Feb 11, 2025 9:00 AM IST

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస చిత్రాలను తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే దర్శకుడు శైలేష్ కొలను డైరెక్షన్‌లో ‘హిట్-3’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న నాని, ఈ మూవీతో మరో సాలిడ్ హిట్ అందుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో ‘ది ప్యారడైజ్’ అనే మూవీని అనౌన్స్ చేశాడు.

అయితే, ఇప్పుడు ‘ది ప్యారడైజ్’ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను నాని రెడీ చేశాడని.. కేవలం అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని తెలుస్తోంది. అనిరుధ్ మ్యూజిక్ వర్క్ కంప్లీట్ చేస్తే ఈ గ్లింప్స్‌ను రిలీజ్ చేసేందుకు శ్రీకాంత్ ఓదెల రెడీ అవుతున్నాడట. ఈ గ్లింప్స్‌ను ఫిబ్రవరి 20న రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ఈ సినిమాలో నాని వైవిధ్యమైన పాత్రలో నటించబోతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సాహు గారపాటి షైన్స్ స్క్రీన్స్ బ్యానర్‌పై ప్రొడ్యూస్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు