బ‌జ్.. ”టిల్లు క్యూబ్”లో హీరోయిన్ గా తెలుగు బ్యూటీ..?

బ‌జ్.. ”టిల్లు క్యూబ్”లో హీరోయిన్ గా తెలుగు బ్యూటీ..?

Published on Jul 8, 2024 11:30 PM IST

స్టార్ బాయ్ సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ న‌టించిన‌ ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎలాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ ను అందుకున్నాయో మనం చూశాం. త‌న‌దైన యాక్టింగ్ తో సిద్ధు ఈ సినిమాల‌ను ఆడియెన్స్ కు క‌నెక్ట్ అయ్యేలా చేయ‌డంలో స‌క్సెస్ అయ్యాడు. ఇక ఇప్పుడు ”టిల్లు క్యూబ్” అంటూ ఈ సినిమాల‌కు కొన‌సాగింపును చేస్తున్నాడు.

అయితే, డీజే టిల్లులో నేహా శెట్టి హీరోయిన్ గా త‌న‌దైన అందాల‌తో కుర్ర‌కారును ఆక‌ట్టుకుంది. ఇక టిల్లు స్క్వేర్ లో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ కూడా త‌న అందంతో పాటు అభిన‌యంతో ఆక‌ట్టుకుంది. అయితే, టిల్లు క్యూబ్ లో ఓ తెలుగు బ్యూటీని హీరోయిన్ గా తీసుకునేందుకు సిద్ధు ప్లాన్ చేస్తున్నాడట‌.

”ట్యాక్సీవాలా” ఫేం ప్రియాంక జావల్క‌ర్ ఇటీవ‌ల స‌రైన హిట్ లేక స‌త‌మ‌తువుతోంది. అయితే, ఈ బ్యూటీని ‘టిల్లు క్యూబ్’ లో లీడ్ హీరోయిన్ గా తీసుకునేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయట‌. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే, అమ్మ‌డికి ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. ఈ సినిమాతో తిరిగి త‌న కెరీర్ ను ట్రాక్ ఎక్కించే అవ‌కాశం దొరుకుతుంది. ఇక ఈ సినిమాను సితార ఎంట‌ర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడ్యూస్ చేయ‌నుంది. దీనికి సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ త్వ‌రలో వ‌చ్చే అవ‌కాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు