ప్రస్తుతం టాలీవుడ్‌లో ది మోస్ట్ అవైటెడ్ మూవీగా ‘పుష్ప-2’ ఎలాంటి క్రేజ్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసే పర్ఫార్మెన్స్‌తో రానున్నాడు. ఇక ఈ సినిమాను క్రియేటివ్ జీనియస్ సుకుమార్ ఈ సినిమాను మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించాడు. అయితే, ఇటీవల ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ మూవీ బాటలో ‘పుష్ప-2’ వెళ్తుందా అంటే.. అవుననే సమాధానమే వినిపిస్తోంది.
రీసెంట్‌గా ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ చేయగా, భారీ అంచనాల మధ్య ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. అయితే, ‘దేవర’ సినిమాకు సాలిడ్ ప్రమోషన్స్ ప్లాన్ చేశారు మేకర్స్. ప్రీ-రిలీజ్ ఈవెంట్, సక్సెస్ సెలబ్రెషన్స్ వంటివి భారీ స్థాయిలో ప్లాన్ చేశారు. కానీ, పోలీసుల అనుమతి రాకపోవడంతో, ‘దేవర’చిత్రాన్ని తెలుగునాట ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే రిలీజ్ చేశారు.
ఇప్పుడు ‘పుష్ప-2’కి కూడా ఇదే పరిస్థితి ఏర్పడేలా కనిపిస్తుంది. ‘పుష్ప-2’ చిత్రానికి తెలుగునాట భారీ ప్రమోషన్స్ నిర్వహించాలని మేకర్స్ భావిస్తున్నారు. అయితే, హైదరాబాద్‌లో అక్టోబర్ 28 నుండి నవంబర్ 28 వరకు కర్ఫ్యూ పెట్టడం.. ఎలాంటి ఓపెన్ ఈవెంట్స్‌కి అనుమతులు ఉండవని పోలీసులు తెలిపారు. దీంతో ‘పుష్ప-2’కి తెలంగాణలో ప్రమోషన్స్ ఉండకపోవచ్చని తెలుస్తోంది. మరి ఆంధ్రాలో అయినా ‘పుష్ప-2’ ప్రమోషన్స్ చేస్తారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక వరల్డ్‌వైడ్‌గా ‘పుష్ప-2’ చిత్రం డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అయ్యింది.