బ‌జ్.. ”గేమ్ ఛేంజ‌ర్”లో చ‌ర‌ణ్ పాత్ర పేరు ఇదేనా..?

బ‌జ్.. ”గేమ్ ఛేంజ‌ర్”లో చ‌ర‌ణ్ పాత్ర పేరు ఇదేనా..?

Published on Jul 7, 2024 3:00 AM IST

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న తాజా చిత్రం ‘గేమ్ ఛేంజ‌ర్’ షూటింగ్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు శంక‌ర్ తెర‌కెక్కిస్తుండ‌టంతో ఈ మూవీపై ప్రేక్ష‌కుల‌తో పాతు సినీ వ‌ర్గాల్లోనూ అదిరిపోయే అంచాన‌లు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ పాత్ర‌కు సంబంధించిన షూటింగ్ నేటితో ముగిసిన‌ సంగ‌తి తెలిసిందే.

అయితే, ఈ సినిమాలో చ‌ర‌ణ్ పాత్ర‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ సినిమాలో చ‌ర‌ణ్ రెండు విభిన్న పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇందులో ఒక పాత్ర పేరు రామ్ నంద‌న్ అని.. చ‌ర‌ణ్ ఆ పాత్ర‌కు సంబంధించిన షూటింగ్ నే ఇప్పుడు ముగించుకున్నాడ‌ని తెలుస్తోంది. కాగా, ఇందులో ఐఏఎస్ ఆఫీస‌ర్ గా చ‌ర‌ణ్ చేస్తున్న‌ పాత్ర పేరు రామ్ నంద‌న్ అని తెలుస్తోంది.

ఏదేమైనా త‌న పేరు క‌లిసేలా చ‌ర‌ణ్ పాత్ర‌కు రామ్ నంద‌న్ అనే పేరును పెట్టిన చిత్ర యూనిట్ కు అభిమానులు థ్యాంక్స్ చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్ గా న‌టిస్తోండ‌గా, థ‌మ‌న్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. దిల్ రాజు ఈ సినిమాను అత్యంత భారీ బ‌డ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు