బ‌జ్.. డ‌బుల్ ఇస్మార్ట్ థియేట్రిక‌ల్ రైట్స్… ఆ నిర్మాత‌కేనా..?

బ‌జ్.. డ‌బుల్ ఇస్మార్ట్ థియేట్రిక‌ల్ రైట్స్… ఆ నిర్మాత‌కేనా..?

Published on Jul 9, 2024 12:01 AM IST

ఉస్తాద్ రామ్ పోతినేని న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ”డ‌బుల్ ఇస్మార్ట్” ఇప్ప‌టికే షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాధ్ డైరెక్ట్ చేస్తుండ‌గా, గ‌తంలో వ‌చ్చిన ‘ఇస్మార్ట్ శంక‌ర్’ చిత్రానికి సీక్వెల్ గా ఈ మూవీ వ‌స్తోంది. ఇక ఈ సినిమాను ఆగ‌స్టు 15న రిలీజ్ చేస్తున్న‌ట్లు ఇప్ప‌టికే మేక‌ర్స్ అనౌన్స్ కూడా చేశారు.

అయితే, ఈ సినిమా థియేట్రిక‌ల్ రైట్స్ బిజినెస్ ఇంకా క్లోజ్ కాలేద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమా థియేట్రిక‌ల్ రైట్స్ కోసం ఏషియ‌న్ సునీల్, సురేష్ బాబు రూ.36 కోట్ల ఆఫ‌ర్ ఇచ్చార‌ట‌. కానీ, చిత్ర యూనిట్ ఏకంగా రూ.63 కోట్లు డిమాండ్ చేస్తుండ‌టంతో ఈ డీల్ ఇంకా క్లోజ్ అవ‌లేదు. కాగా, తాజాగా ఈ రైట్స్ కోసం ‘హ‌ను-మాన్’ చిత్ర నిర్మాత నిరంజ‌న్ రెడ్డి అత్య‌ధికంగా రూ.45 కోట్లు ఆఫ‌ర్ చేసిన‌ట్లుగా తెలుస్తోంది.

దీంతో నిరంజ‌న్ రెడ్డితో చిత్ర నిర్మాత‌లు చ‌ర్చ‌లు జరుపుతున్నార‌ట‌. మ‌రి ఈ డీల్ క్లోజ్ అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో రామ్ మ‌రోసారి ఎన‌ర్జిటిక్ ప‌ర్ఫార్మెన్స్ తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా న‌టిస్తోండ‌గా, మ‌ణిశ‌ర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్ పై ఛార్మితో క‌లిసి పూరి జ‌గ‌న్నాధ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు