బజ్..”సలార్” షూట్ లో జాయిన్ కానున్న స్టార్ హీరో..?

Published on Jul 24, 2022 5:59 pm IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఆ చిత్రాల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్” కూడా ఒకటి. ఇక ఈ సినిమాపై ఉన్న హైప్ కోసం అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ లెవెల్లో పాలన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాపై క్రేజ్ ఉంది.

ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్ గా ఈ సినిమా షూట్ పై అప్డేట్ కూడా బయటకి వచ్చింది. వచ్చే నెల లోనే ఈ సినిమా షూటింగ్ మేకర్స్ స్టార్ట్ చేస్తుండగా ఈ షూట్ పై మరో ఇంట్రెస్టింగ్ గాసిప్ ఒకటి వినిపిస్తుంది. ఈ షూటింగ్ లో అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న మరో స్టార్ హీరో పృథ్వీ రాజ్ కూడా జాయిన్ అవ్వబోతున్నాడని బజ్ వినిపిస్తుంది.

గతంలోనే పృథ్వీ తన సినిమా ప్రమోషన్స్ టైం లో టైం కుదిరితే సలార్ లో తానూ నటించనున్నానని తెలిపాడు. మరి ఇప్పుడు అది కుదిరి జాయిన్ అవుతున్నాడా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి అయితే ప్రభాస్ తో ఈ స్టార్ హీరోని కలిపి సిల్వర్ స్క్రీన్ పై చూడాలని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :