పైరసీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ దర్శకుడు !
Published on Dec 3, 2017 4:36 pm IST

గత వారం విడుదలైన చిత్రాల్లో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘జవాన్’ కూడా ఒకటి. విడుదలై మూడు రోజులు కూడా గడవకముందే పైరసీ బెడద ఈ సినిమాని చుట్టుకుంది. దీంతో చిత్ర దర్శకుడు బివిఎస్.రవి మీడియా ముందుకొచ్చి పైరసీ సంబంధీకులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ప్రేక్షకులంతా తమకు అండగా నిలబడి కుటుంబాలతో సహా థియేటర్లకు వెళ్లి సినిమాను చూసి ఎంకరేజ్ చేయాలని అన్నారు. అంతేగాక దేశంలో పైరసీ చట్టాలు కఠినంగానే ఉన్నా అవి సరిగా అమలుజరగని చోట నుండి పైరసీ జరుగుతోందని, ప్రభుత్వాలు నడిపే టూరిస్ట్ బసులో సైతం పైరసీ సీడీలను ప్లే చేస్తున్నారని, ప్రభుత్వం దీనిపై తీవ్రంగా స్పందించి సినిమాను కాపాడాలని కోరుకున్నారు.

 
Like us on Facebook