అసలు ఈ ‘కేరాఫ్ కంచరపాలెం’ సంగతేంటి !

kancharapalem

గత కొన్ని నెలలుగా పరిశ్రమలో ఒక చిన్న సినిమా గురించి తెగ చర్చ నడుస్తోంది. ఆ ‘కేరాఫ్ కంచరపాలెం’. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై రానా దగ్గుబాటి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రం పట్ల ఆయన చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ఎందుకంటే ఈ సినిమా అంత కొత్తగా ఉండబోతోందట. గతంలో ఈ సినిమా చూసిన పలువురు సెలబ్రిటీలు కూడ చిత్రం బాగుందని ఫీడ్ బ్యాక్ ఇచ్చారు.

అలాగే ఈ సినిమా న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపికై అందరి దృష్టినీ ఆకర్షించింది. విశాఖపట్నంలోని కంచరపాలెం అనే ప్రాంత నేపథ్యంలో జరిగే ఈ సినిమాలో ఆక్కడి నలుగురి వ్యక్తులకు సంబందించిన కథల్ని చెప్పడం జరుగుతుందట. వాస్తవానికి చాలా దగ్గరగా ఉండే ఈ కథ ప్రేక్షకులకు చాలా కొత్తగా ఉంటుందని అంటున్నారు. మరి ఆ కొత్తదనం ఎలా ఉంటుందో చూడాలంటే విడుదల వరకు ఆగాల్సిందే.

నిన్ననే రానా విడుదలచేసిన ఈ సినిమా యొక్క ఫర్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన లభిస్తోంది. వెంకట్ మహా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను పరుచూరి విజయ ప్రవీణ నిర్మించారు.

Exit mobile version