ఏపీ ప్రభుత్వం నుంచి సినీ పెద్దలకి పిలుపు..ఆ చర్చ కోసమే!

Published on Sep 29, 2021 1:00 pm IST

ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే తెలుగు చిత్ర పరిశ్రమకి మధ్యన ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో తెలిసిందే. ముఖ్యంగా అయితే సినిమా టికెట్ రేట్ లు మరియు సినిమా ఆన్లైన్ టికెటింగ్ విధానంపై గరంగరంగా చర్చ నడుస్తుంది. మరి ఇదిలా ఉండగా గత కొన్నాళ్లుగా సినీ పెద్దలకి సహా ఏపీ ప్రభుత్వానికి అనుకున్న పలుమార్లు అయ్యాయి. దీనితో సరైన సమాచారం ఎవరి దగ్గరా లేకపోయింది.

కానీ ఇపుడు ఫైనల్ గా ఏపీ ప్రభుత్వం నుంచ్చే టాలీవుడ్ పెద్దలకి పిలుపు వచ్చిందట. రేపు గురువారం విజయవాడలో ఈ మీటింగ్ నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. అంతే కాకుండా ఈ మీటింగులో టికెట్ రేట్లు సమస్య అలాగే ఏపీలో 100 శాతం సీటింగ్ ని థియేటర్స్ లోకి తీసుకురావడం సహా పలు ఇతర కీలక అంశాలపై చర్చించనున్నట్టు తాజా సమాచారం. మరి దీని తర్వాత అయినా ఈ ఇష్యూ కి సమాధానం దొరుకుతుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :