మహేష్ బాబు కెమెరా మెన్ కు కోపం వచ్చింది !
Published on Oct 24, 2017 7:37 pm IST


‘మెస్సెల్’ సినిమా తమిళ్ లో విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. తెలుగులో వె నెల 26 న విడుదల చేస్తామని ప్రకటించిన ఇంకా సెన్సార్ పూర్తి కాలేదు, ఫీనియాన్సిల్ ప్రాబ్లమ్స్ వల్ల సినిమా ఆలస్యం అవుతుందని తెలుస్తుంది. తమిళ్ ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఆదరిస్తున్నారు కానీ సినిమాలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే కొన్ని డైలాగ్స్ పై రచ్చ జరుగుతుంది.

జి.ఎస్.టి సిస్టమ్ పై హీరో విజయ్ చెప్పిన డైలాగ్స్ ను వెంటనే తొలగించాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. అయితే ఈ విషయం పై ప్రముఖ కెమెరా మెన్ సంతోష్ శివన్ స్పందించారు. ‘’సినిమా ప్రారంభానికి ముందు ఒక హెచ్చరిక వేస్తె బాగుంటుంది, సినిమాను నిర్మించే విసయంలో ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే ఎటువంటి సన్నివేశాలు ఈ చిత్రంలో చిత్రీకరించలేదని వేస్తె బాగుంటుందని చమత్కరించారు.

 
Like us on Facebook