2.0 తెలుగులో అంత రాబట్టగలదా ?

విజువల్ వండర్ ‘2.0’ చిత్రం మరో 7రోజుల తరువాత ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ఈ చిత్రం యొక్క ప్రమోషన్స్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఇక ఈ చిత్రం తెలుగులో 70కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని సమాచారం. మరి ఒక తమిళ సినిమా ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టాలంటే మొదటి షో నుండే హిట్ టాక్ రావాలి.

అయితే తెలుగులో రజినీ -శంకర్ ల కాంబినేషన్ కు మంచి క్రేజ్ వుండడం అలాగే గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక స్క్రీన్ లలో విడుదలకావడం ఈచిత్రానికి కలిసిరానుంది. ఇక గతంలో రోబో చిత్రం తమిళ్ తోపాటు తెలుగులోను సూపర్ హిట్ అయ్యి కాసుల వర్షం కురిపించింది. మరి అదే మ్యాజిక్ ను ఈ సీక్వెల్ కూడా కొనసాగిస్తుందో లేదో తెలియాలంటే నవంబర్ 29 వరకు వేచి చూడాల్సిందే.

Exit mobile version