స్టార్ హీరోస్ అయిన విక్టరీ వెంకటేష్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న క్రేజీ మల్టీ స్టారర్ మూవీ ‘గోపాల గోపాల’. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన ఓ షాప్ ఓనర్ గా కనిపించనున్నాడు. ఒక సామాన్యుడు తనకు జరిగిన నష్టానికి కారణం దేవుడని, దేవుడిపై ఆస్తినష్టం కేసు పెట్టే కథాశం చుట్టూ తిరిగే ఈ సినిమా బాలీవుడ్ హిందీ మూవీ ‘ఓ మై గాడ్’ కి రీమేక్. ప్రసతుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
మాకు అందిన తాజా చిత్ర టీం ముందుగా అనుకున్నట్టుగా సంక్రాంతికి ఈ సినిమాని పూర్తి చేసి రిలీజ్ చేయగలమా అనే టెన్షన్ లో ఉన్నారు. దానికి కారణం మధ్యలో కొన్ని కారణాల వల్ల సినిమా షూటింగ్ వాయిదా పడడం మరియు స్టార్స్ డేట్స్ లో కొంచెం తేడా రావడం వలన ప్రస్తుతం ఈ చిత్ర టీం చిన్న టెన్షన్ లో ఉన్నారు. మరి అనుకున్న టైంకి ఫినిష్ చేసి రిలీజ్ చేస్తారా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అనే చెప్పాలి.
కిషోర్ కుమార్ పార్ధసాని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని డి. సురేష్ బాబు – శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్నారు. మరి మీరు 2015 సంక్రాంతి కానుకగా గోపాల గోపాల రిలీజ్ అవుతుందని అనుకుంటున్నారా.? మీ కామెంట్స్ ని కింద కామెంట్స్ లో తెలపండి.
