
కింగ్ నాగార్జున – అందాల భామ రమ్యకృష్ణ కాంబినేషన్ అంటే హిట్ పెయిర్ అని అందరికీ తెలిసిందే..వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఈ మధ్యకాలంలో రమ్యకృష్ణ మదర్ పాత్రలు, అత్త పాత్రలు చేస్తూ ఉండడంతో మళ్ళీ వీరిద్దరూ కలిసి పనిచేయలేదు. చాలా రోజుల తర్వాత వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్న సినిమా ‘సోగ్గాడే చిన్నినాయనా’.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మైసూర్ లో జరుగుతోంది. కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు . నాగార్జున – రమ్యకృష్ణ లు ఈ సినిమా వర్కౌట్ అవ్వడానికి ప్రధాన కారణం అవుతారని అంటున్నారు, అలా వీరి కాంబినేషన్ వర్కౌట్ అయితే సినిమా హిట్ అని కూడా అంటున్నారు. ఓ విలేజ్ బ్యాక్ డ్రాప్ ఎంటర్ టైనర్ లో వస్తున్న ఈ సినిమాలో నాగార్జున డ్యూయల్ రోల్ చేస్తుంటే, లావణ్య త్రిపాటి మరి హీరోయిన్ గా నటిస్తోంది. అనూపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు.