నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేను – సమంత

Published on Feb 20, 2022 10:06 pm IST

సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో సామ్ చాలా యాక్టివ్‌ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్‌ ఫోటోలు షేర్‌ చేస్తూ నిత్యం నెటిజన్లతో టచ్‌ లో ఉంది. తాజాగా తన బెస్ట్‌ ఫ్రెండ్‌ తో ఓ ఫోటోను పోస్ట్ చేసింది. నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేను అని ఒక క్యాప్షన్‌ కూడా ఇచ్చింది. బెస్ట్‌ ఫ్రెండ్‌ అంటూ ఆమెతో కలిసి దిగిన ఫోటోలను షేర్‌ చేసింది.

ఇక నాగచైతన్యతో తన విడాకుల తర్వాత విడిపోయిన సమయంలో ఎంతో మానసిక కుంగుబాటుకు లోనయ్యాను అంటూ ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. అలాగే 2021 వ సంవత్సరం తనకు వ్యక్తిగతంగా ఏ రకంగానూ కలిసి రాలేదని సమంత ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. గుణశేఖర్‌ దర్శకత్వంలో ‘శాకుంతలం’ షూటింగ్‌ కంప్లీట్ చేసిన సామ్‌ ప్రస్తుతం ‘యశోద’ అనే సినిమాలో నటిస్తోంది.

సంబంధిత సమాచారం :