ప్రభాస్ సినిమా 9 భాషల్లో అనుకోవచ్చా.?

Published on Oct 9, 2021 7:04 am IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రీసెంట్ గా మరో భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. అయితే ఈ సినిమా ఏకంగా ఎనిమిది భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించడంతోనే ప్రభాస్ పాన్ వరల్డ్ స్టార్ గా ఫిక్స్ అయ్యి పాతుకుపోయినట్టు అర్ధం అయ్యిపోయింది.

అయితే చైనీస్, జాపనీస్ లో కూడా ప్లాన్ చేస్తున్న ఈ సినిమా కీలక ఇంకో భాషలో కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉందా అనిపిస్తుంది. అదే ఇంగ్లీష్ భాషలో.. ఇన్ని భాషల్లో చేసినప్పుడు అది కూడా వదిలేయడం ఎందుకు అని అసలు ప్రశ్న. ఆల్రెడీ “ఆదిపురుష్”, అది కాకుండా డెఫినెట్ గా “ప్రాజెక్ట్ కే” ఇంగ్లీష్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ ఉంది. సో దాని తర్వాత ఇంత గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్న ఈ స్పిరిట్ సినిమా కూడా ఇంగ్లీష్ లో రిలీజ్ చేస్తే మొత్తం 9 భాషల్లో కన్ఫర్మ్ అనుకోవచ్చు. మరి మేకర్స్ ఏం చేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :