‘కెప్టెన్ మిల్లర్’ : ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్

Published on Nov 20, 2023 6:36 pm IST

కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ ధనుష్ హీరోగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కెప్టెన్ మిల్లర్. ఈ మూవీని సత్యజ్యోతి ఫిలిమ్స్ సంస్థ పై సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ గ్రాండ్ గా నిర్మిస్తుండగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

ఇటీవల ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ తో అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచిన కెప్టెన్ మిల్లర్ నుండి ఫస్ట్ సాంగ్ ని నవంబర్ 22న విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం అఫీషియల్ గా ప్రకటించారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, కబేర్ వాసుకి రాసిన ఈ సాంగ్ ని హీరో ధనుష్ స్వయంగా ఆలపించడం విశేషం. శివ రాజ్ కుమార్, సందీప్ కిషన్, నివేదిత సతీష్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్న ఈ మూవీ రానున్న 2024 సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకి రానుంది.

సంబంధిత సమాచారం :