ఆర్జీవీపై కేసులు నమోదవుతున్నాయి !

25th, January 2018 - 04:32:45 PM

అడల్ట్ స్టార్ మియా మాల్కోవా ప్రధాన పాత్రలో రామ్ గోపాల్ వర్మ రూపొందించిన లఘు చిత్రం ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ రేపు రిపబ్లిక్ డే సందర్బంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం పలు వివాదాలకు కేంద్ర బిందువు కాగా తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై పోలీసు కేసులు కూడా నమోదవుతున్నాయి. సామాజిక కార్యకర్త దేవి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు వర్మపై పిర్యాధు చేశారు.

వర్మ తీస్తున్న లఘుచిత్రం మహిళల్ని కించపరిచే విధంగా, వారి మనోభావాల్ని దెబ్బతీసే రీతిలో ఉందని, దాని వలన సమాజానికి చెడు సందేశాలు వెళతాయని, అందుకే సినిమాను రేపు విడుదలకాకుండా ఆపాలని కోరారు. ఇప్పటికే పలు న్యూస్ ఛానెళ్ల డిబేట్లలో తనపై మండిపడుతున్న అనేక మంది తనదైన స్టైల్లో సమాధానాలు ఇస్తూ వచ్చిన వర్మ చట్టపరంగా వారిని ఎలా ఎదురుకుంటారో చూడాలి.