యాక్షన్ రొమాంటిక్ డ్రామా గా తెరకెక్కనున్న “క్యాసెట్ గోవిందు”

Published on Dec 13, 2021 12:05 pm IST

మేకబుల్ పిక్చర్స్ పతాకంపై తాజాగా ప్రారంభమైన చిత్రం క్యాసెట్టు గోవిందు. నేడు ముహూర్తం షాట్ కి ఎస్వీ కృష్ణారెడ్డి, డైరెక్టర్ వీర శంకర్, లక్ష్మీ సౌజన్య లు రావడం జరిగింది. విలేజ్ లో జరిగే యాక్షన్ రొమాంటిక్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ మేరకు తమకు సపోర్ట్ కావాలి అంటూ చిత్ర యూనిట్ తెలిపింది.

చిత్ర డైరెక్టర్ విరాజ్ మాట్లాడుతూ, “మా సినిమా ఓపెనింగ్ కి వచ్చిన పెద్దలు SV కృష్ణా రెడ్డి గారికి, వీర శంకర్ గారికి, సౌజన్య గారి కి చాలా థాంక్స్. అలాగే మీడియా వారికి చాలా చాలా థాంక్స్. ఇది మేకేబుల్ పిక్చర్స్ మీద నిర్మిస్తున్న సినిమా. ఈ సినిమా ని నేనే డైరెక్ట్ చేస్తున్నాను, త్వరలో షూట్ స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ షెడ్యూల్ ఆఫ్టర్ పొంగల్ నుంచి స్టార్ట్ అవుతుంది. మూవీ కథ అంత లవ్ అండ్ యాక్షన్ డ్రామా, ఎక్కడ కంప్రమైజ్ అవ్వకుండా ప్రొడ్యూసర్ గారు మాకు సపోర్ట్ చేస్తున్నారు. సినిమా పరం గా టెక్నికల్ గా కూడా ఎక్కువ స్పాన్ వున్న మూవీ గా తీద్దాం అని ట్రై చేస్తున్నాం. త్వరలో ఆ డీటెయిల్స్ మీడియా ద్వారా తెలియచేస్తాం” అని అన్నారు.

సినిమాటోగ్రఫర్ అశోక్ మాట్లాడుతూ, “ఇది నా ఫస్ట్ సినిమా, థాంక్స్ ఫర్ విరాజ్, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ కి థాంక్ యూ” అని అన్నారు.

మణిధర్ మాట్లాడుతూ, “వచ్చిన మీడియా ప్రతి నిధులు అందరికి వందనాలు, మమ్మల్ని ఆశీర్వదించటానికి వచ్చిన SVకృష్ణా రెడ్డి గారి కి, వీర శంకర్ గారి కి, సౌజన్య గారి కి, అందరికి థాంక్స్. మా సినిమా క్యాసెట్టు గోవిందం పండుగ తరువాత స్టార్ట్ అవుతుంది. మాకు సినిమా అంటే ఇష్టం. నేను జాబ్ మానేసి సినిమా ఫీల్డ్ లోకి వచ్చాను మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి అని కోరుకుంటున్నాను” అని అన్నారు.

కీర్తిలత మాట్లాడుతూ, “ఇక్కడకి వచ్చిన మీడియా మిత్రులు అందరికి నా నమస్కారం, మేక్ బుల్ పిక్చర్స్ బ్యానర్ మీద క్యాసెటు గోవిందు ప్రొడ్యూసర్ మణిధర్ గారు, డైరెక్టర్ విరాజ్ గారు, హీరో విమల్ గారు, రవి గారు, అశోక్ గారు, అందరు కొత్త వాళ్ళతో తీయబోయే మూవీ కి మీ సపోర్ట్ కావాలి. అలాగే ఈ మూవీ లో నేను కూడా యాక్ట్ చేయబోతున్నాను థాంక్ యు ఆల్. ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి చేసి తీస్తున్న సినిమా క్యాసెట్టు గోవిందు సినిమాని మీరు అందరు అశ్విర్వదించాలి అని, అలాగే మీడియా మిత్రులు అందరికి ధన్యవాదములు తెలుపుకుంటున్నాను” అని అన్నారు.

సంబంధిత సమాచారం :