ప్రభాస్ “ప్రాజెక్ట్ కే” కాస్టింగ్ కాల్…వారికి మాత్రమే!

Published on Nov 26, 2021 10:00 pm IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా నుండి పాన్ వరల్డ్ స్థాయి సినిమాలు చేస్తూ ప్రభాస్ తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెబుతున్నారు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ప్రాజెక్ట్ కే. పాన్ వరల్డ్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ పతాకంపై భారీగా నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం లో హీరోయిన్ గా దీపికా పదుకునే ను తీసుకోగా, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే ఏడాది చివరకు పూర్తి అయ్యే అవకాశం ఉంది. తాజాగా ఈ చిత్రం లో నటించడానికి 50 నుండి 70 ఏళ్లు గల వ్యక్తులు, హైదరాబాద్ కి చెందిన వారు కావాల్సింది గా చిత్ర యూనిట్ కాస్టింగ్ కాల్ ను ఇవ్వడం జరిగింది. Vymtalent@gmail.com కి ప్రొఫైల్స్ ను పంపాల్సిందిగా కోరడం జరిగింది.

సంబంధిత సమాచారం :