శేఖర్ గ్లింప్స్ తో ‘రాజశేఖర్’ రెడీ !

శేఖర్ గ్లింప్స్ తో ‘రాజశేఖర్’ రెడీ !

Published on Nov 22, 2021 12:00 PM IST

సీనియర్ హీరో ‘రాజశేఖర్’ ప్రస్తుతం నటిస్తున్న మూవీ… ‘శేఖర్’. చాలా గ్యాప్ తర్వాత రాజశేఖర్ ఈ రీమేక్ చేస్తున్నాడు. మలయాళంలో సూపర్ హిట్టయిన ఒక క్రైం అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆధారంగా ఈ ‘శేఖర్’ మూవీ రాబోతుంది. అయితే తాజాగా ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. నవంబర్ 25వ తేదీన శేఖర్ సినిమా గ్లింప్స్ రిలీజ్ కానుంది.

ఇక ఈ సినిమాలో అను సితార, ముస్కాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాజశేఖర్ కి తప్పనిసరిగా హిట్ కావాలి, అందుకే ఈ సినిమా కోసం కొన్ని రిస్కీ షాట్స్ కూడా చేస్తున్నాడట ఈ సీనియర్ హీరో. నిజానికి ‘గరుడవేగ’తో రాజశేఖర్ కి ఫుల్ క్రేజ్ వచ్చింది. కానీ, ఆ తర్వాత విడుదలైన ‘కల్కి’ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాకపోవడంతో రాజశేఖర్ ఈ శేఖర్ సినిమా పైనే ఆశలు అన్ని పెట్టుకున్నాడు.

ఈ సినిమా అవుట్ ఫుట్ పై గట్తి నమ్మకంతోనే ఉన్నాడు. సినిమా కూడా బాగానే వస్తోందట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు