మెగాస్టార్ సినిమాలో రవితేజకు హీరోయిన్ ఫిక్స్ ?

Published on Mar 27, 2022 9:52 pm IST

మెగాస్టార్ చిరంజీవితో యంగ్ డైరెక్టర్ కె.ఎస్‌. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ఓ పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు రవితేజ కూడా ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. కాగా రవితేజ సరసన కేథ‌రిన్ థ్రెసాను హీరోయిన్ గా ఫైనల్ చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి, రవితేజ, కేథరిన్ లపై కీలక దృశ్యాల చిత్రీకరణ జరుపుతున్నారట.

ఇక ఈ చిత్రంలో చిరు సరసన హీరోయిన్ గా శృతి హాసన్ నటించబోతుంది. అయితే, మెగాస్టార్ సరసన మరో హీరోయిన్ మాళవిక మోహన్ నటించబోతుందట. మరి చిరు – మాళవిక మోహన జోడీ నిజంగానే బాగుంటుంది. ఐతే, ఈ వార్తల పై ఇంతవరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. ఇక బాబీ చేసిన కథ చిరుకి బాగా నచ్చిందని తెలుస్తోంది. ఈ సినిమాని మైత్రీమూవీస్ వారు నిర్మిస్తుండగా.. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :