‘బింబిసార’ నుండి క్యాథరీన్ ఫస్ట్ లుక్ రిలీజ్ …..!

Published on Jul 22, 2022 5:55 pm IST

కళ్యాణ్ రామ్ నందమూరి హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న భారీ సోషియో ఫాంటసి థ్రిల్లర్ యాక్షన్ మూవీ బింబిసార. త్రిగర్తల రాజు బింబిసారుడిగా కళ్యాణ్ రామ్ ఇందులో నటిస్తున్నారు. యువ దర్శకుడు వశిష్ట మల్లిడి తెరకెక్కించిన ఈ ప్రతిష్టాత్మక మూవీకి సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్ని కూడా ఆడియన్స్ లో సూపర్ గా మూవీ పై క్యూరియాసిటీని ఏర్పరిచాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కె హరికృష్ణ ఈ మూవీని నిర్మించారు.

భారీ విజువల్ వండర్ గా తెరకెక్కిన బింబిసార తప్పకుండా ఆడియన్స్ ని అలరిస్తుందని అంటున్నారు యూనిట్ సభ్యులు. ఇక ఈ మూవీలో కళ్యాణ్ రామ్ కి జోడీగా వరీన హుస్సేన్, క్యాథరీన్ త్రెసా, సంయుక్తా మీనన్ నటిస్తుండగా నేడు ఐరా పాత్రలో నటిస్తున్న క్యాథరీన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసారు. బింబిసారుడి ప్రేయసి యువరాణి ఐరాగా క్యాథరీన్ లుక్ అదిరిపోయింది అనే చెప్పాలి. ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ కి అందరి నుండి మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పరిచిన బింబిసార మూవీ ఆగష్టు 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :