‘పుష్ప 2’ లో ఆమెది నెగిటివ్ రోల్ ?

‘పుష్ప 2’ లో ఆమెది నెగిటివ్ రోల్ ?

Published on Nov 21, 2022 8:04 AM IST

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన ‘పుష్ప- ది రైజ్’ చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం ‘పుష్ప 2’ పైనే బన్నీ – సుకుమార్ తమ ఫుల్ ఫోకస్ పెట్టారు. కాగా ‘పుష్ప 2’ లో మరో కీలక పాత్ర ఉంటుందని తెలుస్తోంది. హీరోయిన్ కేథరీన్ థెరీసా కూడా ఈ చిత్రంలో నటించబోతుందట.

కాగా పుష్ప 2లో ‘కేథరీన్ థెరీసా’ ది నెగిటివ్ పాత్ర అని తెలుస్తోంది. అలాగే పుష్ప 2లో మరో సీనియర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఉందని, ఆ క్యారెక్టర్ లోనే మనోజ్ బాజ్ పాయ్ నటించబోతున్నాడని తెలుస్తోంది. ఏది ఏమైనా ‘పుష్ప సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్ ఓ రేంజ్‌లో ఉంది. పుష్పరాజ్ లాంటి పాత్రను స్టార్ హీరో చేసి మెప్పించడం చాలా రిస్క్. కానీ, బన్నీ ఆ రిస్క్ ను బాగా హ్యాండిల్ చేశాడు. పుష్ప 2 కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు