సోషల్ మీడియాలో పవన్ ప్రభంజనం…బర్త్ డే విషెస్ తెలుపుతూ..!

Published on Sep 2, 2021 11:50 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రేక్షకులు, అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో మాత్రమే కాకుండా అటు రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖులు, సినీ పరిశ్రమ కి చెందిన వారు, రాజకీయ నాయకులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కి సంబంధించి హ్యాష్ ట్యాగ్స్ తో విషెస్ తెలుపుతున్నారు. ఒక పక్క అభిమానులు సేవా కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ లాంటి ఇతర కార్యక్రమాలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పలు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ సైతం నేడు విడుదల కానున్నాయి.

సంబంధిత సమాచారం :