బాలకృష్ణకు పద్మభూషణ్.. సోషల్ మీడియాలో సెలబ్రిటీల జోరు!

బాలకృష్ణకు పద్మభూషణ్.. సోషల్ మీడియాలో సెలబ్రిటీల జోరు!

Published on Jan 25, 2025 11:39 PM IST

నటసింహం నందమూరి బాలకృష్ణకు ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో టాలీవుడ్‌లో సందడి వాతావరణం నెలకొంది. కేవలం నందమూరి అభిమానులే కాకుండా యావత్ తెలుగు సినీ ప్రేమికులు ఆయనకు ఈ అవార్డు రావడం పై హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు రాజకీయ నాయకులు మొదలుకొని, సినీ సెలబ్రిటీలు అందరూ సోషల్ మీడియాలో బాలయ్యకు తమ అభినందనలు తెలుపుతూ జోరు చూపిస్తున్నారు.

టాలీవుడ్ నుంచి బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు రావడం పై జూ.ఎన్టీఆర్ మొదలుకొని మెగాస్టార్ చిరంజీవి, నందమూరి కళ్యాణ్ రామ్, మహేష్ బాబు, రవితేజ, దర్శకులు బాబీ, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, మారుతి, నిర్మాత నాగవంశీ, డివివి ఎంటర్టైన్మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్.. ఇలా ఒక్కరేమిటి.. సినిమా ఇండస్ట్రీని నుంచి దాదాపు అందరూ బాలయ్యకు తమ విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.

అటు రాజకీయ నేతలు సైతం బాలయ్యకు తమ విషెస్ చెబుతూ నెట్టింట హల్‌చల్ చేస్తున్నారు. బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు రావడం తో దేశవిదేశాల్లోని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు