హైటెక్‌ సిటీ కియా ఈవీ 6 ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న నటి క్యాథెరిన్‌, కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌!

హైటెక్‌ సిటీ కియా ఈవీ 6 ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న నటి క్యాథెరిన్‌, కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌!

Published on May 27, 2022 6:19 PM IST

కియా యొక్క పూర్తి విద్యుత్‌ ఈవీ6 ను హైటెక్‌ సిటీ వద్దనున్న ఆటోమోటివ్‌ కియా వద్ద ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో నటి క్యాథెరిన్‌, కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ తో పాటుగా కియా ప్రతినిధులు రఘు, గౌతమ్‌, షోరూమ్‌ ప్రతినిధి చెన్న కేశవ, వరప్రసాద్‌ లు పాల్గొన్నారు. ఈ వాహనాన్ని కొండాపూర్‌లో ఉన్న ఆటోమోటివ్‌ కియా, హైటెక్‌ సిటీ వద్ద ప్రదర్శిస్తున్నారు.

ఆసక్తి కలిగిన కొనుగోలుదారులు ఈ గేమ్‌ ఛేంజింగ్‌ ఉత్పత్తిని ప్రత్యక్షంగా చూడవచ్చు. మూడు లక్షల రూపాయల టోకెన్‌ మొత్తం చెల్లించడం ద్వారా ఈ వాహనాన్ని ముందుగా బుక్‌ చేసుకోనూ వచ్చు. భారతదేశంలో ప్రీమియం ఆఫరింగ్‌గా 2022లో 100 మంది వినియోదారులకు ముందు వచ్చిన వారికి ముందు పద్ధతిలో ఈవీ6 ను డెలివరీ చేయనున్నారు. ఈ వాహనాన్ని జూన్‌ 2022 లో విడుదల చేయనున్నారు.

దేశంలో కియా ఈవీ ప్రయాణారంభానికి ప్రతీకగా నిలిచే ఈవీ6ను ఈ జీఎంపీ పై నిర్మించారు. అత్యంత వేగవంతమైన చార్జింగ్‌, అసాధారణ పనితీరుల సమ్మేళనంగా ఉంటుంది. ఈవీ 6 ఇండియా వెర్షన్‌లో 77.4 కిలోవాట్‌ హవర్‌ లిథయం అయాన్‌ బ్యాటరీ ఉంది. ఇది 229 పీఎస్‌ విద్యుత్‌ శక్తిని 2 డబ్ల్యుడీలో ఉత్పత్తి చేయడంతో పాటుగా ఏడబ్ల్యుడీ వేరియంట్‌లో 325పీఎస్‌ శక్తిని విడుదల చేయనుంది. ఒక్కసారి పూర్తిగా చార్జ్‌ చేస్తే 528 కిలోమీటర్ల దూరం ఇది ప్రయాణిస్తుంది. ఇది 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని 5.2 సెకన్లలో అందుకుంటుంది.

కియా ఈవీ6 లో సౌకర్యవంతమైన ఫీచర్లు ఎన్నో ఉన్నాయి. వెడల్పాటి ఎలక్ట్రిక్‌ సన్‌రూఫ్‌, డ్రైవర్‌, ప్యాసెంజర్‌ రిలాక్సేషన్‌ సీట్లు, రిమోట్‌ ఫోల్డింగ్‌ సీట్లు, ఏఆర్‌ హెడ్‌ అప్‌ డిస్‌ప్లే వంటివి దీనిలో ఉన్నాయి. భద్రత పరంగా 8 ఎయిర్‌బ్యాగ్‌లు ప్రామాణికంగా దీనిలో ఉన్నాయి. కియా ఈవీ 6 వాహనం భారతదేశంలో ఐదు రంగులు అయిన మూన్‌స్కేప్‌, స్నో వైట్‌ పెరల్‌, రన్‌వే రెడ్‌, అరోరా బ్లాక్‌ పెరల్‌, యాచ్‌ బ్లూ లలో లభిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు