సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఆకాష్ పూరి “చోర్ బజార్”.!

Published on Jun 19, 2022 1:38 pm IST

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆకాష్ పూరి హీరోగా గేహ్న సిప్పి హీరోయిన్ గా “జార్జ్ రెడ్డి” దర్శకుడు జీవన్ రెడ్డి తెరకెక్కించిన లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ “చోర్ బజార్”. వినూత్న కాన్సెప్ట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం రీసెంట్ గా ట్రైలర్ తో వచ్చి కూడా ఆకట్టుకుంది. మరి వచ్చే వారం రిలీజ్ కి సిద్ధంగా ఉన్న ఈ చిత్రం నుంచి మేకర్స్ లేటెస్ట్ గా అధికారిక ప్రకటన మరొకటి ఇచ్చారు.

ఈ చిత్రం సెన్సార్ కంప్లీట్ చేసుకున్నట్టుగా తెలిపారు. మరి ఈ చిత్రానికి యూ / ఏ సర్టిఫికెట్ ని సెన్సార్ యూనిట్ వారు అందించారు. దీనితో ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కి సిద్ధం అయ్యిపోయింది. ఇక ఈ చిత్రానికి సురేష్ బొబ్బొలి సంగీతం అందించగా ఐ వి ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే ఈ జూన్ 24న ఈ చిత్రాన్ని ప్రముఖ బ్యానర్ యూవీ క్రియేషన్స్ వారు రిలీజ్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :